సంతానలేమికి పరిష్కారం
సంతానలేమితో ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారు. తినే తిండి, చుట్టూ కలుషిత వాతావరణ ప్రభావంతో దంపతులకు సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఈ సమస్యతో సతమతం అవుతూ దంపతులు మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, ఆందోళనకు గురి అవుతుంటారు. సంతానలేమి సమస్యకు పరిష్కారంగా సరోగసిలాంటివి కూడా వచ్చాయి. అయితే సరోగసిలాంటి వాటిని ఇష్టపడని వారు సంతానలేమి సమస్యకు పరిష్కారంగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే సరిపోతుందని తాజాగా వెలువడిన ఓ అధ్యయనం తెలిపింది. అవేంటో తెలుసుకుందాం..
బాదాం, అక్రోట్లు, వేరుశెనగ వంటి నట్స్ మగవారిలో వీర్యం నాణ్యతను పెంచుతాయి. దీంతో సంతాన సామర్థ్యం పెరుగుతుంది. రోజుకు రెండు గుప్పిళ్ల నట్స్ తిన్నా ఫలితం ఉంటుంది. వీటిలోని ఒమేగా 3 పాలీఅన్‌సాచ్యురేటెడ్ కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలులాంటివి పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అయితే ఉప్పు, చక్కెర కలిపినవి కాకుండా పచ్చివి లేదా వేయించిన గింజలు తినటం మంచిది.






