బీజీఎం- పోస్టర్ ఆవిష్కరణ
ముషీరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అం తర్జాతీయ సమ్మేళనం బీజీఎం-2026 పోస్టరును (బిట్సా గ్లోబల్ మీట్-2026) ఆదివారం తెలంగాణ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విడుదల చేసినట్లు బీజీఎం-26 చైర్పర్సన్ అనిత సాకురు, సీఈఓ మయూర్ పట్నాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారు మాట్లాడుతూ జనవరి 9 నుండి11 వరకు హైదరా బాద్లో జరగనున్న బీజీఎం-26లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారు లు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు సహా వెయ్యి మందికి పైగా గ్లోబల్ లీడర్లు పాల్గొంటారని చెప్పారు. మూ డేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని తెలిపారు. జనవరి 10న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొం టారని చెప్పా రు. ముఖ్య వక్తగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా, ప్రత్యేక ఆహ్వానితుడిగా యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాబ్ చౌదరి హాజరవుతారన్నారు.






