15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి

29-12-2025 12:00 AM

ఎంపీ ఈటల రాజేందర్

కంటోన్మెంట్ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం.. 

క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ ఈటల రాజేందర్

సికింద్రాబాద్ డిసెంబర్ 28 (విజయ్ క్రాంతి) :  నియోజకవర్గ అభివృద్దికి అనేక చర్యలు చేపట్టామని మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కంటో న్మెంట్ కాలనీ వాసులు పలువురు ఈటల ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. నిధు లు తెచ్చినందుకు శాలువాలతో సత్కరించారు.పలు విజ్ఞాపన పత్రాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద మల్లికార్జున్ తయారు చేసిన 10 నెలల్లో 15 కోట్ల అభివృద్ధి పేరుతో తయారు చేసిన వీడియో చూశారు.

అభివృద్ధి నివేదికను, 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మీడియా తో ఈటల రాజేందర్ మాట్లాడుతూ 10 నెలల్లో 15 కోట్ల రూపాయలు నిధులు ఖర్చుచేశారు. రోడ్లు, డ్రైన్స్, పార్కుల ఆధునీకరణ పనులు చేపట్టారు.బ్రిడ్జి కోసం భూసేకరణకు వచ్చిన 303 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాల్సినవి కంటోన్మెంట్ బోర్డుకు జమ అయ్యేలా చేశాము. వీటితో డ్రైనేజీ, రోడ్లు అభివృద్ధి చేయబోతున్నాము. కంటోన్మెంట్ లో వెంటనే ఎన్నికలునిర్వహించి, పూర్తి స్థాయి పాలకమండలి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అన్ని ఈటల రాజేందర్ అన్నారు..