రాజకీయ రంగు పులుముకుంటున్న భద్రాచలం హత్య సంఘటన
భద్రాచలం, జూన్ 9 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఏ ఎస్ ఆర్ కాలనీ లో శనివారం జరిగిన గ్యాంగ్ వార్ మర్డర్‌లో పలు ఆసక్తికర అంశా లు వెలుగులోకి వస్తున్నాయి.రెండు కాలనీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ హత్యలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు ఒక వర్గానికి కొమ్ము కాసి దగ్గర ఉండి హత్య చేయించినట్లు మృతుడు కణితి సతీష్ వదిన కణితి సౌజన్య ఆరోపించారు.
సోమవారం తెలంగాణ టూరిజం హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో హత్య జరిగిన ఘటన కు సంబంధించి నిజానిజాలు మృతుని అన్నా, వదిన, కణితి రమణ,సౌజన్యలు నిజాలు వెల్లడించారు.సతీష్ హత్యకు ముందు హత్య చేసిన జాయింట్ సభ్యులు మృతుడి స్నేహితులను ఇద్దరిని కొట్టి సతీష్ ఇంటి ఆచూకీ తెలుసుకున్నట్లు వారి ఆరోపించారు.శనివారం ఉద యం 11 గంటలకు మృతుని ఇంటి వద్దకు చేరిన గ్యాంగ్, మృ తుడు పై దాడి చేసి అత్యంత కిరాతకంగా మారణ ఆయుధాలతో కడుపులో పొడిచి.. గొంతు కోసి... మృతుడు చనిపోయే దాకా అక్కడే ఉండి అడ్డు వచ్చిన మృతుని వదినను, అన్నను విచక్షణారహితంగా కొట్టి చేస్తున్న హత్యను కళ్ళారా చూడాలంటూ అతి కిరాతకంగా హత్య చేసి అక్కడ నుండి దర్జాగా వెళ్ళిపోయారని వారు విలేకరులకు వివరించారు.
జరిగిన సం ఘటనపైకన్నీటి పర్యంతం అవుతూ మీడియాకు తమకు న్యా యం చేయమంటూ వేడుకొన్నారు. ఆరోజు వచ్చిన 16 మంది నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తమ గోడును మీడియాకు వెల్లడించారు.ఈ హత్య వెనక స్థానిక బి ఆర్‌ఎస్ పార్టీ నాయకుడు తో పాటు మొత్తం 16 మంది పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని వీళ్లంతా ఘటన లో ఉన్నట్లు వీ ళ్లంతా కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల పర్యవేక్షణలో విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కో రారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు ఆదివాసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాచలం డివిజన్ లో ఈ హత్యా సంస్కృతి ఎప్పటి నుండో జరుగుతున్నా పోలీ సు శాఖ ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో పట్టపగలు యు వకులు గ్యాంగ్ లీడర్స్ రెచ్చిపోతున్నట్లు గిరిజన నాయకులు ఆరోపించారు.గిరిజనుడు అయిన సతీష్ హత్య వెనుక గల అసలు నిజానిజాలు తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ చొరవ తీ సుకోవాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మృతిని అన్న రమణ, వదిన కనితి సౌజన్య , ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తెల్లం నరేష్, వీరభద్రం, పాయం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.






