17 April, 2026 | 12:52 PM

ఎల్లమ్మ గుడిలో చోరీ

10-06-2025 12:10 AM

భీమదేవరపల్లి మే 9 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా ఎలుకదుర్తి మండలం పెంచికల్పేట గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పెంచికలపేట గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీ పగలగొట్టి కొంత నగదును ఎత్తుకెళ్లారు ఎల్కతుర్తి ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలి 

ములుగు, జూన్9 (విజయక్రాంతి): తెలం గాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగినది అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మధ్యా హ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభానికి రెండు రోజులే ఉంది,

కానీ వంట కార్మికులకు గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడి గుడ్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి మరి ఇప్పుడు వంటలు ఎలా చేయాలో అధికారులు ఆలోచన చేయాలని కోరారు, అలాగే 2023 అక్టోబరు నెల నుండి అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి అన్నారు దానితో పాటు రాగి జావ తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్ల ఖర్చు చాలా అవుతుంది ఎలాంటి పారితోషికం లేకుండా తయారు చేయడం ఇబ్బంది కనుక రాగి జావకు ప్రతీ విద్యార్థికి రూ,,2 చెల్లించాలని డిమాండ్ చేశారు .

ఏఐటియుసి నాయకులు ముత్యాల రాజు, సంఘం జిల్లా అధ్యక్షురాలు సామల రమ, ములుగు,వెంకటాపూర్, గోవిందరావు పేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగ పేట, వెంకటాపురం, వాజేడు కన్నాయి గూడెం నుండి,పోరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, లక్ష్మి,పి సమ్మక్క, జమున, సుశీల,విజయ, చెంచులక్ష్మి,రమణ, వెంకటలక్ష్మి,రాజ్యలక్ష్మి, రాజకుమారి, పధ్మ,షఫియా, బండి జయ మ్మ,జానకీ,జే లక్ష్మి,యం సరోజన, సుమతి, నర్సమ్మ, తులసి, కుమారి, వెంకటరమణ, రమాదేవి, ఫైమా, లావణ్య, నాగమణి, భవాణి,సుగుణ,తదితరులు పాల్గొన్నారు