15 నుంచి భద్రకాళి ఉత్సవాలు
12-07-2026 12:00 AM
29 వరకు శాకాంభరి నవరాత్రులు
వరంగల్, జూలై 11 (విజయక్రాంతి): వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 29 వరకు శాకాంభరి నవరాత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామల సునీత తెలిపారు. శాకంభరీ వేడుకల ప్రచార పోస్టర్‌ను శనివారం ఆలయంలో ఆవిష్కరించారు. 15న అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, 29న శాకంభరి అలంకారం కార్యక్రమాలను వైభవోపీతంగా నిర్వ హించనున్నట్లు తెలిపారు.
15 రోజులపాటు ఆలయంలో శాకంభరి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. శాఖాంభరి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృపకు పాత్రు లు కావాలని కోరారు.






