calender_icon.png 16 September, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన యోధుడు భగత్ సింగ్..

23-03-2025 06:59:09 PM

ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరుపారి వెంకటేశ్వర్లు..

మునుగోడు (విజయక్రాంతి): భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటి సామ్రాజవాదులను గడగడలాడించిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పురి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేసేందుకు తన ప్రాణాలను బలిదానం చేసిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. దేశంలో యువత సంక్షేమం ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉప్పర బోయిన సతీష్, బండారు శంకర్, మండల కార్యదర్శి చాపల శ్రీను, దుబ్బ వెంకన్న, తిరందాస్ శ్రీనివాస్, పుల్కరం ఆంజనేయులు, గోస్కొండ మల్లేష్, చాపల విప్లవ కుమార్, బొలుగురి వంశీ, పగిళ్ల బాబు, జి రాము, ఏ నాగరాజు ఉన్నారు.