03-12-2025 01:06:54 AM
కొత్తపల్లి, డిసెంబరు 2 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని సచ్చిదానంద స్వామి ఆశ్రమం రామాలయంలో అహోబిల జీయర్ స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా శ్రీమ ద్ భాగవత సప్తాహ మహోత్సవం ప్రారంభమైంది. ఈ అహోబిల జీయర్ స్వామి మాట్లాడుతూ మాసానాం మార్గశీర్షోహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అన్నాడు భగవంతుడు భగవద్గీతలో....
అ లాంటి మార్గశీర్ష మాసంలో నారాయణ వైభవం భగవంతుని వైభవాన్ని వినడం, స్మరణ చేయడం చాలా విశేషమని అన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యులు స్వామివారిచే మంగళా శాసనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాధవి నారాయణరెడ్డి, వేద భవన్ వరప్రసాద్, రాజ భాస్కర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారా యణ, తదితరులుపాల్గొన్నారు.