calender_icon.png 3 December, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెబల్స్ జోష్..!

03-12-2025 01:04:01 AM

  1. అభ్యర్థుల పరేషాన్ 

స్థానిక ఎన్నికల్లో పోటాపోటీ 

దిక్కుతోచని అభ్యర్థులు 

తగ్గేదేలే.. అంటున్నరెబెల్స్

స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్ అభ్యర్థులు పోటీ జోష్ తో అసలైన అభ్యర్థులు పరేషన్లో ఉన్నారు. దీని తో అసలైన అభ్యర్థులు పంచాయతీ పోటీ లో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నా రు. అధిష్టాన నాయకత్వం కూడా ఎవరిని పోటీలో ఉంచాలో ఎవరిని పోటి నుంచి త ప్పుకోమని చెప్పాలో అర్థం కాని స్థితిలో అధిష్టానం ఉన్నది. మండలంలో యువత ఎక్కు వమంది పోటీ పడడంతో ఈ పరిస్థితి నెలకొని ఉన్నది.

మండలంలోని దాదాపు పది పంచాయితీ స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొన్నది. కొన్ని గ్రామపంచాయతీలలో ఒక్కొ క్క పంచాయతీకి ఇద్దరి నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాలలోని ఓటర్లు కూడా ఎవరి కి ఓటు వేయాలో చెప్పుకోలేని స్థితిలో ఉన్నా రు. ఈ పంచాయతీ ఎన్నికలు తమకే అవకాశం ఇవ్వాలని పోటీ చేసే అభ్యర్థులు, పోటీ లో ఉన్న రెబల్స్ ఎవరికి వారే అధిష్టానం దగ్గర తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.

మండలంలోని ఏ వర్గం వారు తమ అభ్యర్థులే గ్రామాలలో పోటీచేయాలని పట్టుబడు తున్నట్లు సమాచారం. దీనితో గ్రామాలలో పోటాపోటీ వాతావరణం నెలకొని ఉన్నది. గ్రామాలలో రెబెల్స్ తోపాటు ,పోటీలో ఉన్న అభ్యర్థులు, ఓటర్లు కూడా ఏమీ అర్థం గాని పరిస్థితులలో ఉన్నారు. చివరకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటారో, ఎవరు పోటీలో ఉండరో ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని విజయం వరిస్తుందో 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఎర్రుపాలెం డిసెంబర్ 2 (విజయ క్రాంతి):మండలంలోని గ్రామపంచాయతీలకు అభ్యర్థులతో పాటు రెబల్స్ పోటీ జోష్ గా ఉండడంతో ,పోటీ చేసే అభ్యర్థులు రెబల్స్ బెడద తో ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. మండలంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో దాదాపు 10 గ్రామపంచాయతీలకు తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఒక గ్రామ పంచాయతీకి ఇద్దరి నుండి ముగ్గురు అభ్యర్థులు ఒకే రాజకీయ పక్షానికి చెందిన అభ్యర్థులు పోటీ చేయడంతో అసలైన అభ్యర్థులు ఎవరు..! రెబల్స్ అభ్యర్థులు ఎవరు..! మాలో ఎవరు అని అధిష్టాన నాయకులు దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తున్నారు.

పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులు తాము ఎప్పటినుంచో ఈ పదవులను ఆశిస్తున్నామని కావున తప్పక మమ్మల్ని పోటీలో ఉంచాలని ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా అధిష్టానం దగ్గర చెప్పుకుంటున్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేస్తే తమ యొక్క అర్థ ,అంగ ,రాజకీయ, తమ బలాబలాలు ఎంత ఉన్నాయో వివరిస్తూ అధిష్టానం దగ్గర చెప్పుకొని మాకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. అధిష్టానం కూడా ఈ ఎన్నికల్లో ఎవరిని పోటీలో ఉంచాలో ఎవరిని పోటీలో నుంచి తప్పించాలో అర్థం కాని స్థితిలో ఉన్నది.

ఈ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసిన దగ్గర నుండి గ్రామాలలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఎర్రుపాలెం, రేమిడిచర్ల, తెల్ల పాలెం, పెగలపాడు రామన్నపాలెం, సకిన వీడు ,పెద్ద గోపవరం, కండ్రిక, కొత్తపాలెం గ్రామాలలో ఇద్దరి నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడంతో ఓటర్లు తమ ఓటును ఎవరికి వేయాలో అర్థం కానిస్థితిలో ఉన్నారు.

కవేళ అధిష్టానం మమ్మల్ని తప్పించి ఉంచితే అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రెబల్స్ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడానికి మాకు ఏమీ అర్హత లేదో చెప్పాలని అధిష్టాన నాయకులను రెబల్స్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటారో ఎవరు పోటీలో ఉండరో ఎవరికి ఓటు వేయాలో చివరకు విజయం ఎవరిని వివరిస్తుందో 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని మండల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.