27 February, 2026 | 2:42 AM

భగవతిలో ఘనంగా ఎడ్వైట్ 2026

27-02-2026 12:33 AM

ముకరంపుర, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): నగరంలోని భగవతి స్కూల్లో గురువారం ఎడ్వైట్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మినీ వార్షికోత్సవం, తల్లిదండ్రుల అవగాహన సమావేశం నిర్వహించారు. భగవతి స్కూల్ చైర్మన్ బి రమణారావు, కరస్పాండెంట్ బి విజయలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి

మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఏమి ఆశించాలి, ఏమి ఆశించకూడదు అనే విషయాలనువివరించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సి. ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.