ఉరుములు మెరుపులతో వర్షం
22-04-2026 12:53 AM
రాజాపూర్ ఏప్రిల్ 21: మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పండ్ల తోటలో కూరగాయలు సాగు చేసిన రైతులు వర్షాల వల్ల నష్టం వాటిల్లుతుందని బెంగపడుతున్నారు. కాగా ఉదయం నుంచి భానుడి భగభగలతో ఉక్కపోతతో తల్లాడిల్లిన ప్రజలు సాయంత్రం చల్లని చిరుగాలుతో వర్షం కురవడంతో సేదతిరారు.






