calender_icon.png 23 May, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తొలి సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ

23-05-2025 01:46:13 AM

జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్

నారాయణపేట. మే 22(విజయక్రాంతి) : అణగారిన వర్గాల అభ్యున్నతి ప్ప సంఘసంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో  భాగ్యరెడ్డి వర్మ 137 జయంతి ఉత్సవంలో  పాల్గొని భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ దళిత సమాజోద్దరణ, అంటరానితనం, మహిళల బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారని, జోగిని వ్యవస్థను తొలగించడానికి పాటుపడ్డారని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్. లోకల్ బాడీ సంచిత్ గంగ్వర్, ఆర్డీవో రామచందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, ఎస్. సి. కార్పొరేషన్ ఈ. డి. అబ్దుల్ ఖలీల్, డి పి ఆర్ ఓ రషీద్, ఏవో జయసుధ,వెంకటేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.