23-05-2025 01:44:38 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ మే 22 (విజయ క్రాంతి) : ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
బస్టాండ్ లో గ్రంధాలయం ఏర్పాటు రీడింగ్ రూమ్ ను, హన్వాడ మండలం దాచేపల్లి గ్రామంలో పిరమిడ్ క్షేత్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం గ్రామంలో అభయ వరధాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం తో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చామని, సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన చెప్పారు.
ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి అని తెలిపారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ , ఐఎన్టీయుసి రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, అవేజ్, సంజీవ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, అబ్దుల్ హక్, దేవేందర్ నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, చిన్న, ప్రశాంత్, తిరుమల వెంకటేష్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు