16 April, 2026 | 2:54 AM

నిర్మల్ జడ్పీ సీఈవోగా భాగ్యలక్ష్మి

16-04-2026 01:31 AM

 నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిషత్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన బి.భాగ్యలక్ష్మి బుధవారం కలెక్టర్ అభిలాష అభినన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంతకుముందు సిద్ధిపేట జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన భాగ్యలక్ష్మి పదోన్నతిపై నిర్మల్ జిల్లా పరిషత్ సీఈఓగా నియమితులయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ శంకర్, అధికారులు నారాయణ, షాహిద్ పాల్గొన్నారు.