మక్క కొనుగోళ్లపై కొర్రీలు ఎందుకు?
నేడు ప్రత్యక్ష ఆందోళనకు అన్నదాతలు సిద్ధం
లక్ష్మణ్‌చందా, ఏప్రిల్ ౧5 (విజయక్రాంతి): ఎండనక వాననక కాయకష్టం చేసి మొక్కజొన్న పంట సాగు చేస్తే పంట చేతికొచ్చిన కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణచందా మండలంలోని కనకాపూర్ వడ్యాల్. పారుపల్లి, కూచంపల్లి, చింతల్ చింత, తిరుపతి, ధర్మారం టీచర్, బాగా పూర్ తదితర గ్రామాల్లో సుమారు 5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
పంట చేతికి రావడంతో కోత కోసి మురిపిడి చేసి పంటను అమ్ముకునేందుకు రోడ్లపై ఆరబెట్టిన రైతులు కొనుగోలు కేంద్రం లేక పంట ఎలా విక్రయించాలో అర్థంకాక ఇబ్బందికి పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించడం లేద ని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం మొక్కజొన్నకు 2400 మద్దతు ధర ప్రకటించక బయట 1800 నుంచి 2000 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే తమకు మద్దతు ధర లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని రైతాంగం గురువారం నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది






