calender_icon.png 2 December, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ తండా సర్పంచ్ అభ్యర్థిగా బానోతు రమాదేవి శంకర్ నాయక్

02-12-2025 05:18:15 PM

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామానికి కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్షం బలపరిచిన అభ్యర్థిగా బానోత్ రమాదేవి శంకర్ నాయక్ పేరును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యామంజి నాయక్ మంగళవారం ఖరారు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచిగా గెలిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పులి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కొండా నాయక్, వెంకట రమణ, నవీన్ నాయక్, సీనియర్ నాయకులు భీముడు నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.