సిద్ధాంతమే బీజేపీ బలం..
కేంద్రమంత్రి బండి సంజయ్
గన్నేరువరం, ఏప్రిల్6(విజయక్రాంతి):గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద సోమవారం బిజెపి జెండా గద్దే ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న సిద్ధాంతం, భావాజాలం తో నే ఈ స్థాయికి వచ్చిందన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా అవతరించిందని , క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి అన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు దేశాన్ని ఏలుతుందని , వరుసగా 3 సార్లు కేంద్రం లో అధికారం లో వచ్చిందని, దేశంలోనే తిరుగు లేని శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆకాంక్షించినట్టు అర్హులైన పేద వారందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యలపై నిరంతరం పోరాటం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినుకొండ నాగేశ్వర్ కరివేద మైపాల్ రెడ్డి రెడ్డి పుల్లెల పవన్ కుమార్ సొల్లు అజయ్ వర్మ ముత్యాల జగన్ రెడ్డి సోమరాజు రెడ్డి పకిడి మహేందర్ పుల్లల రాము బొమ్మిడి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




