నాకు ఖమ్మం టికెట్ రాకుండా భట్టి అడ్డుకున్నడు
l బీజేపీకి అనుకూలమని అసత్య ప్రచారం
l పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
l ఒక రోజు మౌనదీక్ష చేసిన వీహెచ్..
l నిమ్మరసం ఇచ్చిన దానం నాగేందర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తనకు ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. భట్టి విక్రమార్కకు రాజీయం గా తాను ఎన్నో అవకాశాలు కల్పించానని గుర్తుచేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొంద రు దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకు నిరసనగా శనివారం అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వీహెచ్ మౌన దీక్ష చేశారు. వీహెచ్‌కు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని గత ఐదేండ్లుగా అక్కడ పని చేసుకుంటూ వచ్చానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎంగా రేవంత్‌రెడ్డి అవుతారని తాను చెప్పానని, ఆ విషయంలో భట్టి కక్షగట్టి తనకు టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బయటి నుంచి వచ్చే వారికి టికెట్ ఇచ్చేలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని కోరారు. భట్టి విక్రమార్కను సొంత తమ్ముడిగా భావించినట్లు తెలిపారు. కానీ, తన విషయంలో ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు.






