19 April, 2026 | 3:46 AM

బీఆర్ఎస్ లోపాలు చూపించడానికి మేం సిద్ధం: భట్టీ

17-12-2024 12:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వ లోపాలను చూపించడానికి మేం సిద్దంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంతో తెలంగాణ శాసనసభలో భట్టి మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్లు అప్పు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినక చేసింది కాదని, రూ.52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని భట్టీ విక్రమార్క తెలిపారు. సివిల్ సప్లై బిల్లులు కూడా రూ.62 వేల కోట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి పంటను కోనుగోలు చేసి సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు.

పదేళ్ల విధ్వంసాన్ని ఒకేసారి సరిచేయడం వీలుకాదన్నారు. తప్పులు కప్పిపుచ్చుకోవాడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తూ సభ చర్చను తప్పు దారి పట్టిస్తున్నారని భట్టి మండిపడ్డారు. గతంలో ఇదే సభలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు కాదా.. మరి ఎందుకు ఇవ్వాలేకపోయారని ప్రశ్నించారు. సభలో కీలక అంశాలపై చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్ష నాయకులు భంగం కలగిస్తునారని విమర్శించారు. ప్రివిలేజ్ గురించి ప్రతిపక్షలు తామకు చెప్పే హక్కులేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహించారు.