19 April, 2026 | 1:51 AM

ఎఫ్‌ఆర్‌బీఎం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు

17-12-2024 12:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4,17,490 కోట్లు మాత్రమే ఎఫ్ఆర్బీఎంలో తీసుకుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో రూ.7 లక్షలు తీసుకున్నామని అంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫ్ఆర్పీఎం మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు చేసిందని, ఇలానే అప్పులు కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు చేస్తారని హరీశ్ రావు ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు 4,17,496 కోట్లు మాత్రమే అని శాసనసభ ముఖంగా సవాల్ చేశారు. కరోనా సమయంలో అప్పులు తీసుకొమ్మని కేంద్రం చెప్పిందని హరీశ్ రావు పేర్కొన్నారు.