calender_icon.png 8 July, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు పతకాలు సాధించిన భవాని

08-07-2025 01:35:42 AM

మహబూబాబాద్, జూలై 7 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొలిపాక భవాని సోమవారం వరంగల్ నగరంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తెలుగు లిటరేచర్ విభాగంలో డిగ్రీ, పీజీ లో రెండు బంగారు పతకాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు.

2015 నుంచి 2018 డిగ్రీ తెలుగు లిటరేచర్ విభాగంలో గోల్ మెడల్ సాధించారు. అలాగే 2019 - 21 వరకు నిన్నే తెలుగు లిటరేచర్ లో గోల్ మెడల్ సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన భవాని లక్ష్యంతో చదివి బంగారు పతకాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.