calender_icon.png 8 July, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం

08-07-2025 09:09:58 AM

తెలుగు సినీ పరిశ్రమలో(Telugu film industry) విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణికి(M. M. Keeravani) పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiva Shakthi Datta Passed Away) మంగళవారం కన్నుమూశారు. ఆయయ వయసు 92 సంవత్సరాలు. వయోభారం కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా పలు సినీ గీతాలు రచించారు. రాజమౌళి తండ్రి విజేయేంద్రప్రసాద్(Rajamouli father Vijayendra Prasad), శివదత్తా అన్నదమ్ములు. రచనలకే కాకుండా ఆయనకు చిత్రలేఖనంలో కూడా అసాధారణ ప్రతిభ దాగిఉన్న విషయం తెలిసిందే. ఆ మ‌ధ్య శివ శ‌క్తి దత్తా ప్ర‌తిభను చూసిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మంత్ర ముగ్దుడయ్యారు. 92 ఏళ్ల వయసులోనూ శివ శక్తి దత్తా ఆర్ట్ అద్భుతంగా గీసారు. స్వయంగా గీసిన దేవుళ్ల చిత్రపటాలు, శివాజీ మహారాజ్ బొమ్మతో ఆయన నివాసం దేవాలయంలా కనిపిస్తోంది. ఈ దృశ్యాలను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. కీరవాని తండ్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.