08-07-2025 10:31:23 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మంగళవారం ఉదయం 11కు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకోనున్నారు. ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy) కేటీఆర్ సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుంటున్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్(Somajiguda Press Club ) ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమాజీగూడ వద్ద పోలీసులు వాహనాలను సిద్ధంగా చేసి ఉంచుకున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.