calender_icon.png 8 July, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు: కేటీఆర్

08-07-2025 11:07:54 AM

  1. సీఎం రాకుంటే మంత్రులైనా వచ్చి చర్చ జరపాలి: కేటీఆర్
  2. రేవంత్ రెడ్డి తప్పుకుంటే.. కేసీఆర్ చేసి చూపిస్తారు.

హైదరాబాద్:  ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ప్రెస్ క్లబ్ కు బయలుదేరే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. హామీల అమలుపై ఈ ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నో సార్లు ఆహ్వానించామని సూచించారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే.. మాకు మైకు ఇవ్వరని తెలిపారు. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్ క్లబ్ లోనైనా చర్చకు రావాలని చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి డిల్లీలో ఉన్నారని తెలిసింది.. సీఎం రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రాకుంటే మంత్రులైనా వచ్చి చర్చ జరపాలన్నారు. సీఎం ఇవాళ హాజరుకాకుంటే మరోరోజు చర్చకైనా మేం సిద్ధమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వీలైన తేది, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నామని కేటీఆర్ కోరారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా హాట్లాడనిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి తప్పుకుంటే.. కేసీఆర్ చేసి చూపిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.