calender_icon.png 1 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భీమా కోరేగావ్ శౌర్య దివస్

01-01-2026 04:21:22 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జే త్వాన్ బుద్ధ విహార్‌లో గురువారం 208వ భీమా కోరేగావ్ శౌర్య దివస్‌తో పాటు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవాన్ గౌతమ బుద్ధుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి బుద్ధ వందన చేశారు. 1818లో భీమా కోరేగావ్‌లో మహార్ బెటాలియన్ సాధించిన చారిత్రక విజయాన్నిస్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సంఘాలు, సమాజ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.