01-01-2026 04:23:59 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని కామారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్వో పి.నార్సింగ్ చౌహన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో పి.నర్సింగ్ చౌహన్ నేషనల్ కార్యక్రమాల గురించి,గర్భిణీ స్త్రీల వివరాలు,కుక్క కాటుకు, పాము కాటుకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారు సృజన్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు.ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం పరిసరాలను వివిధ గదులను పరిశీలించి ఎప్పుడు వైద్య కేంద్రం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.సిబ్బంది విధులకు సమయాన్నిసారాన్ని పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్,సిబ్బంది మురళి, అశ్వక్,హరి సింగ్ తదితరులు ఉన్నారు.