ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీ చేసిన భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాను కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలందరికీ స్వంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి జరుగుతుందని, ఎవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో తమ బృందం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు...ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కణతాల నాగయ్య, కలకొండ పున్నయ్య, శేఖర్ రెడ్డి, కణతాల వీరన్న, జిల్లపల్లి ఉప్పయ్య పాల్గొనడం జరిగింది.




