25 March, 2026 | 2:11 AM

భూదాన్ భూములను పేదలకు ఇవ్వాలి

25-03-2026 12:00 AM
  1. ఇందిరా పార్క్ ధర్నాకు తరలివెళ్లిన 

రావి నారాయణరెడ్డి కాలనీ గుడిసెవాసులు 

ఎల్బీనగర్, మార్చి 24 : భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కుంట్లురులోని రావి నారాయణ రెడ్డి పేజ్ - 3 కాలనీ భూ పోరాట కేంద్రం నుంచి 50 డీసీఎం వాహనాల్లో వేలాది మంది గుడిసెవాసులు తరలివెళ్లారు.

ధర్నా కు వెళ్తున్న డీసీఎం లను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆ యన మాట్లాడుతూ... గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకపోవడం వల్లనే నిరుపేదలు సిపిఐ పార్టీ పిలుపు మేరకు భూదాన్ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారన్నారు.

మాది ప్రజా ప్రభు త్వం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. భూధాన్ భూ ములపై ఉన్న కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ద్వారా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, సిపిఐ నాయకులు సామిడి శేఖర్‌రెడ్డి, హరిసింగ్ నాయక్, శ్రీదేవి, పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు