24-04-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్/ చింతలమానపల్లి,ఏప్రిల్ 23(విజయ క్రాంతి):ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం రైతులకు మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని చింతల మానేపల్లి,బెజ్జూర్ మండలాల్లో భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కులపై ఏర్పాటు చేసన అవగాహన కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, కాగజ్ నగర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని ప్రతి రైతు పూర్తిగా తెలుసుకో వాలని, ఈ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
ప్రతి వ్యక్తికి ఆధార్ ఎం త ప్రాముఖ్యమో ప్రతి సర్వే నంబర్‌కు భూధార్ కార్డులు అంతే ప్రాముఖ్యంగా జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టంలో అప్పీలు వ్యవస్థ తీసుకురావడం వల్ల రైతులకు న్యాయం జరుగు తుందని, న్యాయస్థానాలకు వెళ్లే అవసరం ఉండదని తెలిపారు. శాసనమండలి సభ్యులు విఠల్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఈ చట్టంలో అప్పీలు వ్యవస్థ, సాదా బైనమాల పరిష్కారం, పార్ట్ బి లో ఉన్న పెండింగ్ భూముల పరిష్కారానికి అవకాశం ఉందని తెలిపారు.
భూభారతి చట్టంలో భూ సమస్యలు చాలా వరకు స్థానికంగానే పరిష్కారం అవుతాయని, ప్రతి సమస్యకు పరి ష్కార మార్గాలు ఉన్నాయని తెలిపారు. రెవిన్యూ గ్రామాలలో ప్రత్యేక సదస్సులు నిర్వహించి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను అధ్యయనం చేసి పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, తహసిల్దార్ మునవార్ షరీఫ్, కాగజ్ నగర్ వ్యవసాయ సహా య సంచాలకులు మనోహర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలి
కాగజ్‌నగర్, ఏప్రిల్ 23(విజయ క్రాంతి): ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని కాగ జనగర్ పట్టణంలోని ఆర్.టి.సి. ప్రయాణ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగంగా ఫాతిమా స్వయం సహాయక సంఘం పరిధిలోని అంబేద్కర్ సహాయక సంఘం సభ్యురాలు ఎం.లలిత ఏర్పాటు చేసిన విజయ డైరీ పార్లర్ షాప్ ను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విజయ డైరీ పార్లర్ షాపులను ప్రారంభిం చడం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఎ.పి.ఎం. భూమక్క, సెర్ప్ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.