19 March, 2026 | 1:09 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

23-04-2025 11:01 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అధికారులకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను డీఎస్పీలు, సిఐలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితికి లోబడి ఉండాలని గ్రేవ్ కేసుల ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్ఓసి తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్స్ ఏరియాగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులు సూచించారు. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా సూచించారు. వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి  ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.