calender_icon.png 14 May, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ అగ్ని ప్రమాదం

24-04-2025 12:00:00 AM

మ్యాక్స్ వాహనాలతోపాటు వ్యవసాయ పనిముట్ల దగ్ధం

తాంసి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):  తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామ సమీపంలో పంట చేలకు అనుకోని ఉన్న బొమ్మిడి బుచ్చన్నకు చెందిన పశువుల పాక అగ్నిప్రమాదంలో దగ్దమైంది. పశువుల పాక తో పాటు స్పింక్లర్లు, గడ్డి ఇతర వ్యవసాయ పనిముట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమా రు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిం దని రైతు వాపోయారు.

అదేవిధంగా గండ్ర త్ అభిలాశ్, దారట్ల ప్రవీణ్‌లకు చెందిన మాక్స్ పికప్ వాహనాలు 50 శాతం మేర కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న తాంసి ఎన్‌ఐ రాధిక ఘటన స్థలానికి చేరు కుని గ్రామస్థుల సహాయంతో మంటలను అదుపు చేశారు. గ్రామస్థులు, యువకులు మంటలార్పడంలో చూపిన చొరవను  ఎస్ ఐ రాధిక అభినందించారు.