16 April, 2026 | 11:19 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భూసమస్యల పరిష్కారానికే భూభారతి

17-05-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

లక్షెట్టిపేట, మే 16: భూసమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకో వడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట, దండేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాల్లో భూ భారతి, నూతన ఆహార భద్రత కార్డుల ప్రక్రియను తహసీల్దార్లు దిలీప్ కుమార్, సంధ్యా రాణిలతో కలిసి వేరు వేరుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి రిజిస్టర్లు, రికార్డులు, పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అర్హత గల నిరుపే దలకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం మండలంలోని జెం డావెంకటాపూర్, బలరావుపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పా టు రూ.500ల అదనపు బోనస్,  రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతు లు, ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇసుక తీసేందుకు నిబంధనల మేరకు అనుమతులు

- మంచిర్యాల, మే 16 (విజయక్రాంతి): జిల్లాలో ఇసుక తీసేందుకు నిబంధనల మేర కు అనుమతులు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్‌తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో ఇసుక తీసేందుకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో అందిన దరఖాస్తులపై జిల్లా రెవెన్యూ, నీటిపారుదల, భూగర్భ జల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ, మైన్స్ & జియోలజీ, టి.జి.ఎం.డి.సి. శాఖల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి అనుమతి జారీ చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని తెలిపారు. 

నిర్మాణ పనులను పూర్తి చేయాలి

ప్రభుత్వం జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా భవనం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాతమంచిర్యాలలో నిర్మించ తలపెట్టిన మహిళా భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గుత్తేదారుల సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.