calender_icon.png 18 May, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు

17-05-2025 12:00:00 AM

చేర్యాల, మే 16 : మానవులంతా ఒక్కటే. తోటి మనిషిని  మానవత్వంతో చూడాలే తప్ప కులాన్నో, మతాన్నో చూసి ఆదరించడం మనిషి తత్వం కాదని నిరూపిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ ముస్లిం యువకుడు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న భావనను పాటిస్తూ, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ముందుకు సాగుతున్నాడు. అన్వర్ పాషా ది చేర్యాల మండలం వీరన్న పేట గ్రామం.

చిన్నప్పట్నుంచి చుట్టూ హిందువులు స్నేహితులుగా ఉండడంతో తన మత ఆచారాలను పాటిస్తూనే, పరమతాన్ని పట్ల గౌరవించడం అలవాటు చేసుకున్నాడు. అందులో భాగంగానే ప్రతి ఏటా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్పంచుకుంటూ, హిం దువులతో పాటు 11 రోజులపాటు నియమ నిష్ఠలతో ఉంటాడు.

ఈ సంవత్సరం మరో అడుగు ముందుకేసి మాలాధారణ చేసిన హనుమాన్ భక్తులకు తన సొంత ఖర్చులతో అన్నదానం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వితరణ కార్యక్రమంలో స్వయంగా తానే పాల్గొని వడ్డించడం విశేషం.

ఈ సందర్భంగా అన్వర్ పాషా మాట్లాడుతూ హిందూ ముస్లిం భేదభావం లేకుండా అందరూ సోదర భావంతో మెలగాలని తన పుట్టిన గ్రామం నేర్పిందని తెలిపారు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న భావనతో తను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. తనకు మతం,కులం ముఖ్యం కాదని మానవత్వమే ముఖ్యమని తెలిపారు.