ఉపాధ్యాయుల శిక్షణ పరిశీలించిన జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్
17-05-2025 12:00 AM
మెదక్, మే 16(విజయక్రాంతి): డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ పి.మదన్ మోహన్ మెదక్ జిల్లాలో కేజీబీవీ మెదక్ నందు జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్స్ ఉల్లాస్ కార్యక్రమం, బడిబాట, ఉచిత యూనిఫామ్ లు, పుస్తకాల పంపిణీ, తల్లిదండ్రుల సమావేశం మొదలైన అంశములపై రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.రాధా కిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తిఉన్నారు.






