18 April, 2026 | 4:39 PM

భూసమస్యల పరిష్కారానికే భూభారతి

20-06-2025 12:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో నిర్వహించిన భూ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు.  సదస్సులో రైతులు సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

గత ప్రభుత్వం ధర ణి పోల్టర్ అమలు చేయడం వల్ల రైతులకు భూ సమస్యలు సత్వరంగా పరిష్కరించేందు కు అవకాశం లేకపోయిందని భూభారతి చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డిఆర్‌ఓ రత్నా కళ్యాణి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.