18 April, 2026 | 5:57 PM

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయండి

20-06-2025 12:00 AM

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): నిర్మ ల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధులతో చేప ట్టి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. గురువారం  మున్సిపల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ నిర్వ హించి జరుగుతున్న అభివృద్ధి పనులపై రికా ర్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు.

ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరా తదితర పథకాలపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కల గకుండా సత్వరమే పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు ఉన్నారు.