14-11-2025 08:00:50 PM
ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కార్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈక హనుమంతు వరంగల్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న కార్లపల్లి గ్రామానికి చేరుకొని ఈక హనుమంతు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈక హనుమంతు వ్యక్తిత్వం, పార్టీ పట్ల ఆయన చూపిన కమిట్మెంట్, పార్టీ కోసం చేసిన సేవలను భూక్య జంపన్న స్మరించుకున్నారు. హనుమంతు అందరిలో లేరనే వార్త తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.