02-06-2025 07:24:08 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని అరూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన బండారు అఖిల్ రెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు సాధించారు. కాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకలలో బండారు అఖిల్ రెడ్డికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా సైకిల్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ ఆరూరు ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.