calender_icon.png 12 July, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్దుంపూర్ పాఠశాలలో సైకిళ్లు పంపిణీ

12-07-2025 01:52:46 AM

కొత్తపల్లి, జులై11(విజయక్రాంతి):కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మండలం ముక్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ పదవ తరగతి విద్యార్థులకు బిజెపి నేత బండి సంపత్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల ఆవరణలో బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బండి సంపత్ కుమార్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఉచితంగా సైకిళ్లను అందించడం జరిగిందన్నారు.

కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రిస్థాయి వరకు బండి సంజయ్ కుమార్ అంచెలంచలుగా ఎదిగారని , ఆయన రాణించిన విధానం ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశనం లాంటిదన్నారు.క్రమశిక్షణ, పట్టుదలతో కరీంనగర్లో పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేశారనిపేర్కొన్నారు.