2 May, 2026 | 2:31 PM

నలభై రూపాయలకే సైకిలు

30-08-2025 12:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

మా అన్నదమ్ముల మధ్య ఆస్తి విభాగం జరిగినప్పుడు, నా పాలుకు పాత సైకిల్ వచ్చింది. అప్పటికి నేను హైదరాబాదులో చదువుకుంటున్నాను. తిలక్ రోడ్డులో నివాసంతో పాటు, సారస్వత పరిషత్తు కళాశాల ఉండ డం వల్ల ఆ సైకిల్‌తో నాకు పని లేకుండా పోయింది. కాని మకాం గౌలిపురాకు మా ర్చిన తర్వాత సైకిల్ అవసరం ఏర్పడింది. ‘ నీ పాలుకు వచ్చిన పాత సైకిల్ ఇక్కడ మూలన ఎన్ని నాళ్లని ఉంచుతావు? హైదరాబాద్‌లో నడిపించుకోవచ్చు కదా!’ అని మా నాన్నగారు నన్నెన్నో సార్లు కోరారు.

కాని, హైదరాబాదులో నేనుండడమే క ష్టం, సైకిలుకు ఎక్కడ చోటని దాన్ని తీసుకరాలేదు. గౌలిపురాకు వచ్చిన తర్వాత పరిషత్తుకు పోవాలంటే సైకిల్ ఎంతో అవసరమని గుర్తించాను. 1970 దశకంలో హైదరాబాదు సిటీలో ఎక్కువగా సైకిళ్లు తిరిగేవి. కొత్త సైకిల్ కొందామని అనుకున్నాను గాని దాని వెల ఐదు వందల రూ పాయలు. ఎక్కడి నుంచి తేగలను? మా లాంటి విద్యార్థులకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ?  మా తల్లిదండ్రులిస్తే బాగుండు గాని, మాది నిరుపేద కుటుంబమాయే.

పాతపట్నంలోని గౌలిపురాకు నివాసం మార్చిన తర్వాత, బొగ్గుల కుంట లో ఉన్న సారస్వత పరిషత్తుకు ఎక్కువగా నడిచే వెళ్లేవాణ్ణి. అప్పుడప్పుడు బస్సులో వెళ్లేవాణ్ణి. కానీ బస్సెక్కాలంటే చార్‌మినార్ దాకా నడవాలి. సైకిల్ నడపడమంటే నాకుచాలా ఇష్టం. నిజానికి జీవితంలో నాకు మూడు కోర్కెలుండేవి. ఒకటి: ఈత నేర్చుకోవడం. రెండు: సైకిల్ ప్రయాణం, మూడు: కుట్టుమిషన్ నేర్చుకోవడం. ఈత, కుట్టుపని.. ఈ రెండూ బా ల్యంలోనే అ భ్యాసమయ్యాయి.

ఇక సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎన్ని దెబ్బలు తాకాయో, అన్నీ భ రించినాను. వేగంగా సైకిల్ మీద వెళ్ళడం అ భ్యాసమైంది. సైకిల్ ప్రయాణమంటే ఇష్టమున్న నేను ఒక సైకిల్ పాతదైనా కొ నుక్కుంటే బాగుండుననిపించింది. కాని అదెలా సాధ్యమవుతుంది ఈ పేదవానికి? పరిషత్తు ప్రాచ్యకళాశాలకు వెళ్లినప్పుడు తరుచుగా సైకిల్ కిరాయికి  తీసుకునేవాణ్ణి. ఆ కిరాయి కూడా గంటకింత అని ఉండేది.

దానికి పంక్చర్ ఐతే ఆ బాధ్యత మనదే. పోలీసువాడు పట్టుకుంటే మనమే దండు గ కట్టాలి. కిరాయి సైకిల్ మీద ప్రయాణించినప్పుడు టైర్ పంక్చర్ అయితే ఒక్కోసారి గాలి కొట్టించుకోవడానికి పైసలుండేవి కా వు.  అప్పుడు సైకిలు ను నే నే నడుపుకుం టూ, దాన్ని తీసుకున్న స్థలానికి వచ్చేవాణ్ణి.   నా పాలు కు వచ్చిన సైకి లు ఊళ్లో మా చిన్నాన్న నడుపుతున్నాడని తెలిసింది.

నేను దాన్ని ఆయన నుంచి దూరం చేయ డం భావ్యం అనిపించలేదు. సైకిల్ మీద మక్కువ గల నేను, రేపు పెళ్లుతై, ఒక కొత్త సైకిలును కట్నంగా తీసుకోవాలన్నంత పట్టుదల నాలో కల్గింది. కానీ ప్రస్తుతానికి సైకిలు కావాలి ఎట్లా అని ఆలోచిస్తుండగా, వెదకబోయిన తీగ కాలుకు తగిలినట్లు ఒక మంచి అవకాశం లభించింది. 

ట్యూషన్ డబ్బులతో..

ఒకరోజు గౌలిపురాలో, టైర్ పంక్చర్ ఐతే గాలి కొట్టే వ్యక్తి ‘సార్! మీరు ఎన్ని రోజులని కిరాయి సైకిలు మీద పొతారు? ఒక కొత్త సైకిలు కొంటే సరిపోతుంది కదా !’ అని సలహా ఇచ్చాడు. ‘అరే బాబు కొత్త సైకిలు కాదు, పాత సైకిలు కొనటానికి కూ డా నాదగ్గర డబ్బుల్లేవయ్యా!’ అన్నాను. దానికి అతడు సమాధానమిస్తూ ‘మీరు పాత సైకిలు కొంటానంటే నేనిస్తాను.’ అ న్నాడు. ‘అరే ఇది బాగుంది . కాని అతడెంతకు ఇవ్వగలడో ? అని సందేహిస్తూ ‘ ఎం తకిస్తావు’అన్నాను .

‘నలభై రూపాయలకిస్తాను తీసుకుంటారా?’అన్నాడు. నాకు ఆశ్చర్యమే కాదు, ఆనందం కల్గింది. నేను ఓకే అనగానే అతడు తన సైకిల్ రిపేరింగ్ షాప్ లోంచి ఒక సైకిలు నా ముందుంచి’ ఇదే  ఆ సైకిలు, నడిపి కూడా చూసుకో. ఆ తర్వాతనే తీసుకో’ అని నమ్మకంగా పలికాడు. నాలుగా నెలలుగా ట్యూషన్ చెప్ప డం వల్ల వచ్చిన డబ్బులో నిజంగా నా దగ్గర నలభై రూపాయలే మిగిలాయి. వెం టనే రూంకు వెళ్లి ఆ డబ్బు తీసుకొని వచ్చాను . నలభై రూపాయలతనికి ఇచ్చి సైకిలు తీసుకున్నాను. 

దొంగ సైకిలైతే కాదుగా?

అతణ్ణి అప్పుడనుమానంతో అడిగాను ‘ఇది దొంగ సైకిలు కాదు కదా?’ అని. ‘లే దు సార్! దీన్ని? నేనే తయారు చేశాను.  నాదగ్గరికి సైకిళ్లు తీసుకొని వచ్చినవాళ్లు, అవి నడవ లేనప్పుడు నాకే అప్పగిస్తారు. చెడిపోయిన భాగాలను మరమ్మత్తు చేసి ఇ స్తాను. కొత్త విడి భాగాలను అమరుస్తాను. పాడైన వాటిని బాగు చేస్తాను. అట్లా నిర్మాణమైనదే ఈ సైకిలు’ అని అతడు నేను కొ నబోయే సైకిలు చరిత్రను కూలంకషంగా తెలియ జేశాడు.

అతని మాటల మీద నమ్మకంతో సైకిలు కొని ఇంటికి తీసుకొని వచ్చాను. బొట్టుపెట్టి కొబ్బరి కాయ కొట్టా ను. ఓ పూలమాల సైకిలు మెడలో వేసి పూజ చేశాను. చక్రాల క్రింద నిమ్మకాయలు పెట్ట్టి నడిపించాను గానీ, ఒక నిమ్మ కాయ కూడా నలిగిపోలేదు. నలభై రూపాయలకే సైకిలు నా చేతికి వచ్చినందుకు ఆ భగవంతునికి దండం పెట్టాలి. కానీ, ఆ సైకిలుకు ఎన్ని దండాలు పెట్టానో నాకే గుర్తు లేదు. ఎలాగైతేనేమి, నా విద్యార్థి జీవితానికి ఆ సైకిలు సాక్ష్యంగా నిలబడింది.

ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ విషయాన్ని తెలిసిన వారికి చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ సైకి లే నాకు తోడుగా నిలిచింది.  వివాహం ఐన తర్వాత, నా అర్థాంగి ప్రమీలను వెనక కూర్చుండబెట్టుకొని గౌలిపురాలోని  ‘అప్సరా’ టాకీసు’, ‘ సుధా టాకీసు’లకు, ఛాదర్‌ఘాట్‌లోని ‘కమల్ టాకీస్’కు వెళ్లిన రోజులున్నాయి.

నా పాతసైకిలు చూసి జాలిపడి, కొత్త సైకిలు కొనివ్వాలంటే మా మామగారు  కూడా అంత స్తోమత ఉన్నవారు కారాయే. పాత పట్నం నుంచి సికింద్రాబాదుకు మకాం మారిన తర్వాత కూడా పాత సైకిలే నాకు దిక్కుంది, మొక్కుం ది. ఉద్యోగం దొరికినా కొత్త సైకిలు కొనాలన్న కోరిక నాలో కలగలేదంటే  నలభై రూపాయల సైకిలెంత ప్రియమైందో అర్థం చేసుకోవచ్చు! 

ఐదు వందలతో కొత్తది..

ఒక రోజు నా అర్థాంగి ప్రమీల ‘ఒంటరిగా ఉన్నమీరు గృహస్థులయ్యారు. ఉద్యో గం లేని మీరు ఉద్యోగులయ్యారు. అద్దె గ దుల్లో ఉన్న మీరు సొంత ఇంటి కి వచ్చా రు. పాతపట్నంలో పాత సైకిలెక్కారు. సికింద్రాబాదుకు వచ్చినంక కూడా ఈ పాత సైకిలుతో ఎన్నాళ్ళు కాపురం చేస్తారు’ అని ప్రశ్నించింది. నేను సమాధానం దాటవేశాను. కాని ఒకరోజు  నా దగ్గరి బంధువు మా ఇంటికి వచ్చి ‘కొత్త సైకిలు కొనలేకపోయారా?’ అని అడిగాడు.

‘ ఆ మాటలకు నాలో రోషం పెరిగింది’.‘నువ్వీ సైకిలు కొ నుక్కుంటే, నేను కొత్తది తీసుకుంటాను’అన్నాను . ‘ఐతే నాకు వందరూపాయలకు  ఇస్తారా?’అని అడిగాడు నవ్వుతూ. ఇదం తా గమనిస్తున్న నాకాంతామణి ‘ఎందుకియ్యరు? ఆ వంద రూపాయలు నాకిచ్చి సైకిల్ తీసుకొని వెళ్ళండి’అంది. నా నోట్లో పచ్చి ఏలక్కాయ పడినంత పనైంది. ఏమి మాట్లాడలేకపోయాను. మౌనంగా అతడిచ్చిన వందరూపాయలు తీసుకొని సైకిలత నికి అప్పజెప్పాను.

పదేళ్లు సుమారుగా నాకు తోడుగా ఉన్న పాత సైకిలు  నా నుం చి దూరమవుతుందంటే దుఃఖం కల్గింది. కొత్త సైకిలు కొంటే ఆనందం కల్గుతుందో లేదో గాని పాత సైకిలు నాకు కంటతడిపెట్టించింది. అప్పుడు మెల్లగా మా ఆవిడ చె ప్పిన మాటలు నాకాశ్చర్యాన్ని కల్గించాయి. ‘పెళ్లి నాడు మా నాన్న మీకు బత్తీల స్టౌ ఉందని, బర్నల్ స్టౌ కొనిచ్చారు.

కాని పా త సైకిలుందని కొత్త సైకిలు కొనివ్వలేదు. కానీ మా నాన్నగారు నాకెప్పుడో నాల్గు వందలిచ్చారు. ఈ వంద కలిపి కొత్త సైకి లు కొనండి’ అంది. ఆ మర్నాడే కొత్త సైకి లు ఇంటికి వచ్చింది. కానీ ఈ నాటికీ నల భై రూపాయల సైకిల్‌ను మరచిపోలేదు.

 వ్యాసకర్త సెల్: 9885654381