24 June, 2026 | 3:11 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

02-05-2026 01:06 PM

హైదరాబాద్: మనం చేసే తప్పులు ఎవరూ చూడడం లేదని రెచ్చిపోతాయి. ఈ నేపథ్యంలోనే నేరగాళ్లు ఎవరు చూస్తాలేరని విచ్చలవిడిగా హత్యలు, నేరాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ లు చేస్తుంటారు. అలాంటి వారిని నిఘా నేత్రాలు(CCTV footage) పట్టిస్తాయి. తాజాగా అత్తను ఓ అల్లుడు హెల్మెట్‌తో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన స్నేహిత్(28) అనే యువకుడు హైదరాబాద్ కు చెందిన కావ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన కావ్య తల్లి అరుణ(39)ను బండిపై తీసుకెళ్తూ అల్లుడు స్నేహిత్ హెల్మెట్‌తో కొట్టాడు.

దీంతో ఆమె నియంత్రణ కోల్పోయి బండిపై నుండి రోడ్డుపై పడిపోయింది. ఈ దాడిలో అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనకు ఫిట్స్ ఉందని అందరిని నమ్మించిన అల్లుడు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు అరుణ చనిపోయింది. కావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అత్తపై దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.