03-02-2026 12:42:14 PM
- కాంగ్రెస్ పార్టీలోకి 15వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. 15 వార్డులోని ఆ పార్టీ అభ్యర్థి తవిటి ఇందిర నిరంజన్ నామినేషన్ దాఖలు చేసి బీఫామ్ అందుకునే సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అభ్యర్థి భర్త తవిటి నిరంజన్ గత కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన 15వ వార్డు మాజీ కౌన్సిలర్ ఇసాక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఇందిర పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో 15వ వార్డులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అభిప్రాయపడుతున్నారు.