01-10-2025 12:00:00 AM
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: ‘ప్రధాని మోదీజీ.. మీరు లద్దాఖ్ ప్రజలను మోసం చేశారు. అక్కడి ప్రజలు కేవలం వారి హక్కులను సాధించుకునేందుకే పోరాటం చేస్తున్నారు. దయచేసి హింసా రాజకీయాలు ఆపండి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకండి. వారితో సంభాషించండి. వారి బాధలు తెలుసుకోండి’ అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు.
జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పోలీస్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతిచెందిన ఘటపై మంగళవారం ఆయన పార్లమెంట్ వేదికగా విరుచుకుపడ్డారు. అక్కడ జరిగిన హింసాకాండపై నిష్పక్షపాతమైన న్యాయ విచారణ జరపాలని, దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖాకార్జున ఖర్గే మా ట్లాడుతూ.. ‘లద్దాఖ్ ప్రజల దుఃఖం.. దేశమంతటి దుఃఖం’ అని పేర్కొన్నారు.