24 June, 2026 | 1:46 AM

పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

24-06-2026 12:57 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 23 (విజయ క్రాం తి): మేడ్చల్ పట్టణంలో భవన నిర్మాణ కా ర్మిక రంగానికి చెందిన పెయింటర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఇటీవల పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను నేపథ్యంలో తమకు పనికి తగ్గ గిట్టుబాటు రేటు కల్పించాలని బిల్డర్లను మేస్తిరులను ఇంటి యజమా నులను కోరారు.

ఈ సమస్యపై యూనియ న్ ఆఫీసు వద్ద పెయింటర్ల కార్మికులందరూ ఏకమై మేడ్చల్ పట్టణమంతా బైక్ ర్యాలీ చే స్తూ  కార్మికులారా ఏకంకండి పెయింటర్ల కు తగిన గిట్టుబాటు రేటు కల్పించండి పెయింటర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు విజయవంతంగా భారీ ఎత్తున 200 మంది కార్మికులతో బైక్ ర్యాలీ నిర్వహించా రు.

యూనియన్ ఆఫీస్ వద్ద కొత్త పెయింటర్ కార్మికులకు యూనియన్ ఐడి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి, సురేష్, సుధా కర్ అనిల్, శ్రీకాంత్ రెడ్డి, నారాయణ గౌడ్, హనుమంత్ గౌడ్, మూర్తి, బి రమేష్ ,చిన్న యాదగిరి, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, కే శ్రీకాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు.