జగన్నాధపురంలో విత్తన మేళా
ములకలపల్లి,జూన్ 23 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని అశ్వరావుపేట వ్యవసాయ శాఖ ఏడిఏ రవికుమార్ సూచించారు. ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతు వేదికలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మేళాను జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్,రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు సాగు చేయాలని ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనం మాత్రమే వాడాలని పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగే విధంగా వ్యవసాయ అధికారులు రైతులను చైతన్య పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో జగన్నాధపురం ఉప సర్పంచ్ జలగం మాధవి,ఏవో అరుణ్ బాబు,ఎఇఓలు,క్లస్టర్ పరిధిలోని ఐదు పంచాయతీల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






