24 June, 2026 | 1:59 AM

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన

24-06-2026 12:57 AM

మధిర, జూన్23 (విజయ క్రాంతి): వంగవీడు ప్రభుత్వ స్కూళ్లు నందు మధిర రూరల్ ఎస్త్స్ర విశ్వతేజ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... యువత డ్రగ్స్ రాకెట్ మత్తుకు అలవాటు పడకుండా మంచిగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు కావాలని అన్నరు. ఎవరైనా డ్రగ్స్ విషయంలో అనుమానం వచ్చినట్లు ఉంటే  పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ వైస్ చైర్మన్ అయిలూరి సత్యనారాయణ రెడ్డి, పోలిస్ స్టేషన్ సిబ్బంది కోట దర్మ, పంచాయతీ కార్యదర్శి, రమేష్,  పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.