28 July, 2026 | 2:08 PM

Breaking News

లోన్ పేరుతో మహిళకు రూ.6.70 లక్షల టోకరా   •   జైనూర్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుడికి సుగుణక్క ఘన సన్మానం   •   ఎరువుల కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళన ,హెచ్చరిక   •   రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •  

ఈనెల 15న మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

13-04-2026 02:13 PM

ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 15న  తలపెట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని  మహిళలకు కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ పిలుపునిచ్చారు. నగరంలోని పార్లమెంట్ క్యాంపు  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళలకు సంబంధించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించడంతో దాదాపుగా పార్లమెంటులో 273 స్థానాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం,  ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, మొదలగు కార్యక్రమాలు చేపట్టి మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కి  మద్దతుగా జరుగుతున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు శ్రీలేఖ, శిల్ప, ఉమారాణి ,లక్ష్మి ,పద్మ, మరియు పొన్నం లక్ష్మి పాల్గొన్నారు.