calender_icon.png 8 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడేళ్లలో 2 బిలియన్ డాలర్లు

08-10-2025 01:34:20 AM

ఉద్యోగుల తొలగింపు కోసం ఖర్చు చేసిన యాక్సెంచర్ 

-గత త్రైమాసికంలో 11వేల మందికి పైగా ఉద్వాసన

-ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందే: సీఈవో

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రముఖ టెక్ సంస్థ యాక్సెంచర్ గత మూడు సంవత్సరాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ‘బిజినెస్ ఆప్టిమైజేషన్’ కోసం యాక్సెంచర్ సంస్థ  2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గత త్రైమాసికంలో యాక్సెంచర్ సంస్థ నైపుణ్యలేమితో 11 వేల మంది ఉద్యోగులను తొలగిం చింది. ఈ ఉద్యోగాల కోత ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. కాగా ఈ మొత్తం ప్రక్రియను యాక్సెంచర్ ‘పునర్నిర్మాణ కార్యక్ర మం’గా పేర్కొంది. 

తాజాగా 11, 419 మంది ఉద్యోగాల తొలగింపుతో ఆగస్టు 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా యాక్సెంచర్‌లో పనిచేస్తున్న వారి సంఖ్య 7.79 లక్షలకు పడిపోయింది. గతం లో ఈ సంఖ్య 7.91 లక్షలు గా ఉంది. గత త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పునర్నిర్మాణంతో సంస్థకు ఒక బిలియన్ డాలర్స్‌కు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నా రు. యాక్సెంచర్ ఒకవైపు ఉద్యోగుల సం ఖ్య ను తగ్గిస్తూనే, మరోవైపు ఏఐ సాంకేతికపై భా రీగా పెట్టుబడులు పెడుతోంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఏఐ ప్రాజెక్టుల ద్వారా 5.1 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని సంస్థ తెలిపింది. ఇది అంతకముందు సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా పేర్కొంది. సంస్థకు ప్రస్తుతం 77వే ల మంది ఏఐ డేటా నిపుణులు ఉన్నారని.. రెండు సంవత్సరాల క్రితం ఉన్న 40వేలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని సంస్థ వెల్లడించింది.