08-10-2025 01:32:31 AM
-నూతన పరిశోధనలు, సృజనాత్మకతకు వేదికగా మార్చాలి
-యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.800 కోట్లు కేటాయించాం
-కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
-అమ్మవార్ల పేరుతో ‘వర్సిటీ’ ఏర్పాటు చాలా సంతోషకరం
-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-ఢిల్లీలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు
ఢిల్లీ, అక్టోబర్ 7: ములుగు జిల్లా ఆధ్యాత్మికత, ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మరో కీలక దశను చేరుకుంది. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధిం చిన లోగోను మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఏర్పాటయ్యే సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలుస్తుందన్నారు. ప్రధాని దూరదృష్టి, కిషన్‌రెడ్డి చొరవతో తెలంగాణలో గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే కల నిజమైందన్నారు. ‘యూనివర్సిటీ కోసం కేంద్ర ప్రభు త్వం ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా నిధు లు కేటాయిందన్నారు.
స్థానిక ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కో ర్సులు తీసుకురావాలి. నూతన పరిశోధనలు, సృజనాత్మకతకు వేదికగా మార్చాల న్నారు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మా ట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ సమక్క సారలమ్మ పండుగ నిర్వహించుకోనున్న సందర్భంగా వారి పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొ న్నారు.
యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూ మి కేటాయించిందని, భవనాల నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌కి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వైఎల్ శ్రీనివాస్, కేంద్ర,రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.