2 July, 2026 | 12:26 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

బిల్లులు ఇవ్వకపోతే ఎలా?

12-05-2024 12:05 AM

కాంట్రాక్టర్లు ఎంత వ్యాపార ధోరణితో పని చేసినప్పటికీ నెలల తరబడి రావలసిన బిల్లులు రాకపోతే వారికి సైతం ఆర్థిక ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏర్పాట్లకు సంబంధించిన బిల్లులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో వున్నట్టు వార్తలు రావడం దురదృష్టకరం. మొత్తం రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో వున్నాయని కాంట్రాక్టర్లు పత్రికల వారితో వాపోయారు. జిల్లాల ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్లకు అనుగుణంగానే తాము పనులు పూర్తి చేశామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

- రాజేష్‌రెడ్డి, హిమాయత్‌నగర్